Top Ad unit 728 × 90

Recent posts

recentposts

డయాబెటిస్(.మధుమేహం..) గురించి

డా.జ తి న్ కుమార్

డయాబెటిస్(.మధుమేహం..) గురించి కొంచెం చెబుతాను.దీన్ని అర్ధం చేసుకోవడానికి  రెండు కోణాలలో చూడవచ్చు.వ్యాధి పీడితులైన వ్యక్తుల కోణం నుండి  ఒకటి, రెండవది వైద్యుల కోణం నుండి. . 


ప్రజలు దేనికైన చికిత్స పొందేటప్పుడు  తనరోజువారీ సాధారణ జీవన శైలి లో కనీస మార్పులు ఉంటె నే దీర్ఘకాలం దాన్ని అనుసరించ గలుగుతాడు.జీవితం సాధ్యమైనంత సాధారణమైనదిగా ఉండాలని  కోరుకుంటారు. ఆహార నియమాలు పాటించ వలసి ఉంది కనుక ఈ విషయం తప్పనిసరిగా పరిగణించాలి.సూచనలు, సలహాలు ఆ యా ప్రజల ఆహారపు అలవాట్లకు అనుగుణంగా ఉండాలి.తగిన మోతాదులో, పరిమితుల లో తిన గలిగితే మధు మేహులు  ఏ పదార్ధాన్ని పూర్తిగా  మానివేయ వలసిన అవసరం లేదు.

 మందులు లేకుండా మధుమేహాన్ని నియంత్రించవచ్చు,  అలా జరగాలి అంటే మీరు జీవన విధానంలో చాలా కచ్చితంగా మరియు నియమబద్ధంగా ఉండాలి .మీరు 60 సంవత్సరాల పూర్వం ఉన్న ఆహార విధానం మరియు పని శైలిని వర్తింపజేయండి. మలవిసర్జన కోసం వారు కనీసం 2 కి.మీ.ల గ్రామం నుండి బయటికి వెల్లేవారు యంత్ర శక్తి కంటే తమ శరీరశక్తిని , స్వయం చాలిత సామగ్రి కంటే సాధారణ పనిముట్లు  వాడేవారు.శారీరక శ్రమ కూడా ఎక్కువ. వారు చేసే అన్ని శారీరక పనులను లెక్కించండి. 

ఇక స్త్రీలు,పొలాలు మరియు ఇంటి పనులలో నిమగ్నమై ఉండే వారు. రోజు మొత్తం చెమటలు  పట్టేలా పనిచేస్తుండే వారు. అందువల్ల  కేలరీలు ఖర్చుఅయ్యేవి.. కాలానుగుణమైన మార్పులతో వారు వివిధ రకాల తృణధాన్యాలు మరియు పప్పుధాన్యాలతో 2 లేదా 3 సార్లు ప్రధాన ఆహారాన్ని తీసుకునే వారు.. ఆ రోజుల్లో స్నాక్స్, ఎరేటెడ్ డ్రింక్స్ , (కోలా వంటి సీతలపానీయాలు)లేదా జంక్ ఫుడ్ ఎక్కువ  ఉండేవే కాదు. ఇలా కేలరీలు తీసుకోవడం లో కనపడని  నియంత్రణ  ఉండేది. కాబట్టి ఆహారం మరియు కార్యకలాపాలను సమతుల్యం చేయడానికి క్రమశిక్షణ గల మార్గం అనుసరించే వారు.. దీనికి తోడు జీవితంలో ఆందోళన మరియు ఒత్తిడి ఖచ్చితంగా ఈ రోజు కంటే తక్కువగా ఉండేది .మరియు వారికి భౌతికంగా విశ్రాంతి, మంచి నిద్ర, మానసికంగా సమతులనమైన  జీవితం ఉం డేది. ఇది అనారోగ్యాలను దూరంగా ఉంచుతుంది.
ఈ పద్ధతి ఇప్పుడు చాలా మారిందని మీ అందరికీ తెలుసు .అదే వ్యాధులకి మూల కారణం.అసలు మధుమేహం అనేది ఒక జబ్బు కాదు. అది మన శరీర వ్యవస్థలో అసమతులనం
.అసలు కారణాన్ని సరిదిద్దడానికి బదులుగా మనం లక్షణాలను తగ్గించటం మీదదృష్టి పెడుతున్నాము.ఇది సహజ పద్దతులు పేరిట ..వేపాకు, మెంతులు,  అల్లం బెల్లం తినటం కావొచ్చు, లేదా నోటి  ద్వారా తీసుకునే ట్యాబ్‌లెట్లు కావోచ్చు లేదా ఇన్సులిన్ ఇంజెక్షన్ వంటివి కావచ్చు.అన్నీ తాత్కాలికమే.

 .ఇది వ్యాధి కానందున శాశ్వత నివారణ  అంటూ లేదు. మీరు సమతుల్యతను కొనసాగించినంత కాలం మీరు సాధారణ జీవితం గడప గలరు .లేదా ఎప్పటికీ చికిత్సపై ఆధారపడి  ఉండాలి.
ఇది జీవితకాల ప్రక్రియ కాబట్టి, ఒక వ్యక్తి   విసుగు తో ఈ పద్దతి లేదా ఆ పద్ధతి అని ప్రయత్నిస్తూనే ఉంటాడు .ఏ చికిత్స అయినా తాత్కాలికమే.
రక్తంలో చక్కెర స్థాయిలకు సంబంధించి చాలా అనవసరమైన గందరగోళం వ్యాప్తి చెంది ఉంది.
డయాబెటిస్ గురించి ఎందుకు ఆందోళన చెందాలి? ఎందుకంటే ఇది క్రమంగా మరియు నెమ్మదిగా అంతర్గత ముఖ్యమైన అవయవాలను దెబ్బతీస్తుంది.  దీనికి చాలా సంవత్సరాలు పట్టవచ్చు. నష్టానికి దారితీసే ఏకైక అతి ముఖ్యమైన అంశం హైపర్  గ్లైసీమియా.రక్తంలో అధిక చక్కెర స్థాయి. దానిని సరైన స్థాయిలో నిర్వహించాల్సిన అవసరం ఉంది.

అప్పుడు ప్రశ్న సరైన చక్కెర స్థాయి  అంటె ఏమిటి?.. దీర్ఘకాలంలో అవయవాలకు హాని కలిగించని స్థాయి లో ఉండటం..

మీ చికిత్సను నిర్ణయించడంలో  మీ వయసు, మిగిలి ఉన్న   జీవిత కాలం ఒక ముఖ్యమైన అంశం .. 
ఒక వ్యక్తి  60 ఏళ్లకు డయాబెటిక్‌గా మారినట్లయితే, సుమారుగా అతను 20 ఏళ్లు జాగ్రత్తలు తీసుకోవాలి(80 సంవత్సరాలు సగటు జీవిత కాలంగా తీసుకున్టే) రోగనిర్ధారణ తర్వాత 10 నుండి 15 ఏళ్ళ తరువాతనే సమస్యలు మొదలవుతాయి. అదే అతను నిర్లక్ష్యంగా ఉంటే, 5 నుండి 6 సంవత్సరాలలో కళ్ళు మరియు మూత్రపిండాలు వంటి అవయవాలు దెబ్బతింటాయి. .40 సంవత్సరాల వయస్సులో ఒకరు డయాబెటిస్‌గా మారితే, అతను 40 సంవత్సరాలు  జాగ్రత్త పడాలి, కాబట్టి  అది ఎక్కువ కష్టంగఉంటుంది.రోగ నిర్వహణలో వైఫల్యం కావటానికి ఎక్కువ అవకాశం  ఉంటుంది. సరిగ్గ  అదుపు లో లేని నిర్వహణ కారణంగా, అతను 45 నుండి 50 సంవత్సరాల వయస్సులో  నే సమస్యలకు  గురి కావచ్చు .అందువల్ల జీవితాంతం అతను దెబ్బతిన్న అవయవాలను కూడా  సంరక్షించుకోవాలి.అవి వాటి విధులను నిర్వహించేలా చూడటానికి ఎక్కువ మందులు వాడవలసి వస్తుంది. మనుషులసగటు ఆయుర్దాయం చాలా పెరిగిందని మీకు తెలుసు, కనుక మరింత జాగ్రత్తగా మన ఆరోగ్య నిర్వహణ  చేసుకోవలసిన అవసరం కూడా పెరిగింది. అందువల్ల వైద్యులు  యువకులలో  చక్కెర స్థాయిలు ఏ కొద్దిగా పెరిగినా, వెంటనే చికిత్స ప్రారంభించుతారు. మరియు వృద్ధులలో కొంత ఎక్కువ స్థాయిని అనుమతించే ప్రమాణంగా ఉంచుతారు. 

కానీ ఏ వృద్ధుడు తన వయస్సును అంగీకరించి వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు?

వారు యువకుల కంటే బిపి  మరియు చక్కెర స్థాయిల గురించి ఎక్కువగా ఆందోళన చెందుతున్నారు. రక్త పరీక్షలో  5 లేదా 10 మీ. గ్రా .పెరుగుదల కూడా వారినిభయపెడుతుంది. కాబట్టి వైద్యులు కూడా సగటు విలువలను తగ్గించి ఎక్కువ జాగ్రత్తలు చెబుతున్నారు. అపాయాలు తక్కువ చేయటం కోసం  చెక్కర స్థాయి తక్కువగా ఉండాలనిపట్టుబడుతున్నారు. 

ఈ అవగాహన తోనే మీకు  రక్తంలో షుగర్ ఏ స్థాయి లో ఉండాలో సూచిస్తున్నా. 12 గంటల ఉపవాసం తరువాత  100 నుండి 120 మి.గ్రా వరకూ,మరియు పోస్ట్ లంచ్ , భోజనానంతరం లెవల్స్ 170 నుండి 200 మి.గ్రా (చికిత్సలో ఉన్న డయాబెటిక్ వ్యక్తులలో ) అనుమతించ దగిన మంచి స్థాయిలు.  యాదృచ్ఛికంగా చేసిన రక్త పరీక్షలో చూసినప్పుడు చక్కెర స్థాయి 200 మీ.గ్రా. దాటిన ఎవరైనా డయాబెటిక్‌గా పరిగణించాలి. చికిత్సలో ఉన్న వ్యక్తిలో హెచ్‌బిఎ 1 సి అన్న పరీక్షలో 6.5 నుండి 7.5 వరకు ఉంటె మంచిది. ఇది 8 ని దాటితే కఠినమైన  నియంత్రణ చర్యలు అవసరం.  మితమైన ఆహారపు అలవాట్లు,  మరియు రోజూ కొంత సమయం వ్యాయామం చేసే ఆరోగ్యకరమైన పద్ధతులకు కట్టుబడి ఉండండి.ఈ గణాంకాలు  సంఖ్యల గురించి పెద్దగా బాధపడకండి.
డయాబెటిస్(.మధుమేహం..) గురించి Reviewed by Sri Shivansh on October 03, 2020 Rating: 5

No comments:

All Rights Reserved by Telugu News © 2019 - 2021
Powered By Telugu News, Designed by Telugu News

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.